YSRCP in Assembly (Photo-AP CMO)

Vjy. Fe 24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటు గవర్నర్‌ నుంచి, అటు స్పీకర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్‌ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్‌ చేసింది.

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించండని పోడియంలో నినాదాలు చేశారు. ప్రజల గొంతుకను వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. జగన్, బొత్స సత్యనారాయణ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పోడియంలో నిరసన చేపట్టారు.అయినా స్పందన లేకపోవడంతో వైఎస్‌ జగన్‌(YS Jagan) నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు. గందరగోళం, నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ కీ విడుదల, సందేహాలు ఉంటే ఈ నెల 27 లోగా తెలపొచ్చు

సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందే. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం అని వైఎస్సార్‌సీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు.

Jagan in Assembly

రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్‌ సిక్స్‌ హామీల అమలు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం అని బొత్స అన్నారు.

కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్షం ఈ ప్రజాస్వామ్యంలో భాగం కాదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ కూటమిని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్‌కు సాక్షి(Sakhi TV) సహా పలు ఛానెల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని YSRCP సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు.