Andhra Pradesh: ఏపీలో 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 3లోగా తమకు పోస్ట్ ఇచ్చిన న్యాయస్ధానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం.

High Court of Andhra Pradesh | File Photo

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉన్న జడ్జిలను ఇతర జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఒకేసారి ఇంతమంది జడ్జిలను బదిలీ చేయడం విశేషం. బదిలీ అయిన వారంతా ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఈలోపల పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మూడు రోజుల క్రితమే 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55 మంది జడ్జిలను, బదిలీల ద్వారా 13 మందిని నియమించనున్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now