Balakrishna: ఫొటో దిగారుగా ఇక చాల్లే వెళ్లిపోండి, కొమరవోలు గ్రామస్తులపై చిర్రుబుర్రులాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వీడియో వైరల్

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొమరవోలు గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన ఆ గ్రామస్థులపై 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ కోప్పడినట్లుగా వీడియోలో తెలుస్తోంది

Balakrishna angry on komaravolu Village People

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొమరవోలు గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన ఆ గ్రామస్థులపై 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ కోప్పడినట్లుగా వీడియోలో తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు.

నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు 

ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు. అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కొమరవోలు గ్రామస్తులపై చిర్రుబుర్రులాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Share Now