Deccan Chronicle Attack Row: ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు ? డీసీ కార్యాయలయం దాడిపై స్పందించిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్
ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై విశాఖ టీడీపీ ఎంపీ భరత్ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని డెక్కన్ క్రానికల్ పత్రికకు భరత్ హితవు పలికారు. వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ
చంద్రబాబు కానీ, ఇక్కడి ఎంపీగా నేను కానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ కానీ ఎప్పుడైనా ఏమైనా అన్నారా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీషు మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతా రాహిత్యం. ఇది చాలామంది జీవితాలతో ముడిపడిన అంశం. అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేం చర్యలు తీసుకుంటాం" అని భరత్ స్పష్టం చేశారు.
Here's TDP Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)