Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, సిలిండర్ పేలి గుడిసె దగ్ధం, మంటలు ఆర్పే శక్తి లేక ఏడుస్తూ చూస్తుండిపోయిన తాతా మనవరాలు
మడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయింది. బుధవారం సాయంత్రం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఎగసాయి.
మడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయింది. బుధవారం సాయంత్రం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఎగసాయి. సిలిండర్ శబ్దానికి హుటాహుటిన గుడిసె బయటకు పరుగులు తీసారు దొడ్డణ్ణ, భూతమ్మ, విద్యార్థిని తిప్పమ్మ.గుడిసె మొత్తం కాలిపోవడంతో, అందులో ఉన్న సామగ్రి, నిత్యావసరాలు, సరిఫికెట్లు, దుస్తులు కాలి బూడిదయ్యాయి.రూ.50 వేల నగదు కూడా అగ్గి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భాదితులు.
మనవరాలు పెళ్లికి తెచ్చుకున్న నగలు, మనవరాలు చదువుకున్న మార్క్స్ కార్డ్స్ కూడా ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అవుతుంటే.. ఏం చేయాలో తోచని పరిస్థితిలో, మంటలు ఆర్పే శక్తి లేక, గుడిసె దహనాన్ని అలా చూస్తూ ఉండిపోయారు తాతా మనవరాలు. ఈ ఘటన గ్రామంలోని దళితవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hut Sets Fire as Gas cylinder explodes while cooking in madakasira