Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

Jagan and Vijayasai Reddy (Photo-X)

ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. "నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్ 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement