Tirupati: తిరుపతిలో గోడలపై దేవతామూర్తుల బొమ్మలు తొలగించారన్నది అవాస్తవం, నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్

తిరుపతి నగరంలో గోడలపై కిలోమీట‌ర్ల మేర దేవ‌తామూర్తుల బొమ్మ‌లు చెరిపేశారంటూ కొంద‌రు వ్య‌క్తులు చేస్తున్న‌ది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్త‌వమని తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ధ్రువీక‌రించింది. తిరుప‌తి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

Tirumala

తిరుపతి నగరంలో గోడలపై కిలోమీట‌ర్ల మేర దేవ‌తామూర్తుల బొమ్మ‌లు చెరిపేశారంటూ కొంద‌రు వ్య‌క్తులు చేస్తున్న‌ది పూర్తిగా దుష్ప్రచారం, అవాస్త‌వమని తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ధ్రువీక‌రించింది. తిరుప‌తి నగరంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో గోడ‌ల‌పై జాతీయ నాయకులు, స్వతంత్ర స‌మ‌ర‌యోధుల చిత్రాలు వెలిసిపోయాయి. ఆయా చోట్ల మ‌ళ్లీ ఆయా నాయ‌కుల చిత్రాలే వేస్తున్నారు.

- అంతేత‌ప్ప దేవ‌తా చిత్రాలు చెరిపేసి, వాటి మీద ఒక పార్టీ రంగులు వేశార‌న్న‌ది అవాస్తవం.

- ఈ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ద‌శ‌లవారీగా జ‌రుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్య‌క్తులు ఈ ప‌నులు నిర్వ‌హిస్తున్నారు.

- ఈ విష‌యాల‌ను తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కూడా ధ్రువీక‌రించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement