Mudragada Padmanabha Reddy: బూతులు తిట్టే బదులు ఒకేసారి మా కుటుంబాన్ని చంపేంయడి, పవన్‌ కళ్యాణ్ అభిమానులపై మండిపడిన వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి

సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను.

Mudragada Padmanabham Again Letter to Pawan Kalyan over Remarks (Photo-File Image)

సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను. దీనికి సంబంధించిన గెజిట్ పేపర్లు ఆయన కు పంపిస్తున్నాను. పవన్ ను ప్రేమించే కాపు,బలిజ యువత నిత్యం బూతు సందేశాలు పెడుతున్నారు.  మాట నిలబెట్టుకున్న ముద్రగడ, నేటి నుంచి అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం

ఇది మంచి పద్దతి కాదని నా అభిప్రాయం. అలా కాదంటారా.. మీ మనుషులను పంపి మా కుటుంబాన్ని చంపేయండి అని అన్నారు.కాపుల రిజర్వేషన్‌ సాధించేందుకు పవన్‌ కల్యాణ్‌కు మంచి అవకాశం దొరికిందని.. అలాగే రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ అడుగు ముందుకు వేయమని కాపు ఉద్యమనేత, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సూచించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now