SVSN Varma on AP Deputy CM Post: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు. టీడీపీ పార్టీ పూర్తిగా పోయిందని, భవిష్యత్తు లేదన్న వారందరికీ యువనాయకుడు లోకేష్ యువగళంతో సమాధానం చెప్పారని కొనియాడారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అని పిలుస్తున్నారన్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని నేను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని.. టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు. ఏదేమైనా అధినేత తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమన్నారు.
SVSN Varma on AP Deputy CM Post: