Andhra Pradesh: వీడియో ఇదిగో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పీఠంపై ఉన్న జగన్ పేరును తొలగించిన అధికారులు, పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరని వైసీపీ నేతలు మండిపాటు

విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Officials removed Jagan's name from Dr BR Ambedkar Nyaya Maha Shilpam pedestal in Vijayawada

విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.  మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

అంబేద్కర్ మాన్యుమెంట్‌పై జగన్‌ పేరును తొలగించిన ప్రాంతానికి వెళ్లారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరన్నారు. సీఎం హోదాలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు జగన్. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహ నిర్మాణం వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగింది. స్వయంగా జగన్ ప్రారంభించిన విగ్రహంపై ఆయన పేరే లేకుండా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement