Pawan Kalyan on Ponnavolu: వీడియో ఇదిగో, పొన్నవోలు మదమెక్కి మాట్లాడుతున్నారు, తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. హిందువుగా ఉన్న వ్యక్తి తిరుమల లడ్డూ కల్తీపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు గొప్పదని ఎలా చెబుతారని అన్నారు. నోటికి వచ్చింది మాట్లాడితే రోడ్డు మీదకు లాగుతామని హెచ్చరించారు. పొన్నవోలు తనపై కేసు వేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)