Pawan Kalyan on YSRCP: వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు

Pawan Kalyan (Photo-X/Janasena)

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్‌ వద్ద పవన్‌ మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వాళ్లకి ఆ హోదా దక్కేది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదు.

అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి.. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయండి. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్‌ సమయం కేటాయిస్తారు. వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్లిపోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan on YSRCP opposition status

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now