PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేడు.. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ఆయన సందర్శించనున్నారు.
Vijayawada, Jan 16: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షి(Lepakshi)ని ఆయన సందర్శించనున్నారు. ఇక, ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. వీటిని ప్రధాని ప్రారంభించనున్నారు. లేపాక్షి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు.
Indigo Runway Dinner: రన్ వేపై కూర్చొని ప్రయాణికుల డిన్నర్.. క్షమాపణ చెప్పిన ఇండిగో (వీడియో వైరల్)