PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, శ్రీ రామ జయ రామ అంటూ భగవంతునికి భజన చేసిన ప్రధాని మోదీ, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు
వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాసేపటి క్రితమే రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు. లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను ప్రధాని వీక్షించారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)