Presidential Election 2022: అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత, ఒట్టు తీసి గట్టున పెట్టేశాడని వైసీపీ ఎంపీ వ్యంగ్యం

దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు.

Chandra Babu

దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ముర్ము ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆమెకు టీడీపీ ఘనస్వాగతం పలికింది.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని బాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడా ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని వెల్లడించారు. ఇక సీఎం కాలేనని చంద్రబాబుకు స్పష్టత వచ్చిందని, కానీ పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు ఓటు వేసిన వీడియోను, గతంలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో విలపించిన దృశ్యాలను కలిపి ట్విట్టర్ లో పంచుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Share Now