Selfie With Snake Turns Fatal: పాముతో సెల్పీ దిగాలని మెడలో వేసుకున్న యువకుడు, బుసలు కొడుతూ కాటేయడంతో మృతి, ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్ది కూరపాడుకు చెందిన ఓ యువకుడు పాముతో సెల్పీ దిగుతూ అది కాటేయడంతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ మణికంఠ నడుపుతున్న లస్సీ దుకాణం వద్దకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫోటో దిగాలని మణికంఠ సరదా పడ్డాడు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచాడు.

Representative Photo (Photo Credit: PTI)

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్ది కూరపాడుకు చెందిన ఓ యువకుడు పాముతో సెల్పీ దిగుతూ అది కాటేయడంతో మృతి చెందాడు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ మణికంఠ నడుపుతున్న లస్సీ దుకాణం వద్దకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫోటో దిగాలని మణికంఠ సరదా పడ్డాడు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచాడు.

రేపు పెళ్లి.. అర్థరాత్రి దాకా పనులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన పెళ్లి కొడుకు, చికిత్స పొందుతూ మృతి, రెండు కుటుంబాల్లో తీరని విషాదం

తన సెల్ ఫోన్ ఆ యువకుడికి ఇచ్చి.. ఫోటోలు, వీడియోలు తీయాలని చెప్పి.. ఆ పామును మెడలో వేసుకున్నాడు. అయితే పొరపాటున జారీ పాము కింద పడిపోయింది. తిరిగి దాన్ని మెడలో వేసుకునేందుకు పైకి లాగాడు. ఈ ప్రయత్నంలో పాము.. మణికంఠ చేతిపై కాటేసింది.

పుట్టింటి నుంచి ఇంటికి రమ్మన్నందుకు భర్త నాలుకని కొరికేసిన భార్య, కిందపడి విలవిలలాడిన భర్త, యూపీలో షాకింగ్ ఘటన

దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలు రిమ్స్ కు తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఒంగోలులోని రిమ్స్ కు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement