Hyd, Jan 27: అదిలాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రేపు పెళ్లి అనగా ఈ రోజు పెళ్ళికొడుకు పెళ్లి పనులు చేస్తుండగా గుండెపోటుతో (Bridegroom dies of cardiac arrest) కుప్పకూలిపోయాడు. ఆసపత్రిలో చికిత్ప పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఈ విషాద ఘటన రెండు వైపులా కుటుంబాల్లో తీవ్ర వేదన నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం (day before wedding ) జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
పాముతో సెల్పీ, కాటేయడంతో మృతి చెందని యువకుడు, ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్‌తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది.