K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Senior IAS K Vijayanand Meets CM Chandrababu (Photo-X/CMOAP)

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్, యం.టి.కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామల రావు(TTD EO Shyamala Rao), జీఏడి కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే, జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు ఇతర అధికారులు సీఎస్‌కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

జనసేనలో చేరిన ఆప్కో మాజీ ఛైర్మన్‌ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనను సీఎం అభినందించారు.

K Vijayanand Assumes Charge as Andhra Pradesh Chief Secretary

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)