Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, నా భార్యను భూమి మీద పుట్టలేదని చూపిద్దామని అనుకున్నారా, భక్తులు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలిపే వీడియోలు ఇవిగో..

తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి.

Tirupati Stampede VIdeo(Photo-Video Grab)

తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన భక్తురాలి భర్త మాట్లాడుతూ..నా భార్య చనిపోయింది అని కనీసం ఫిర్యాదు కూడా చేయకుండా మార్చురీ కీ పంపించారు. భూమి మీద పుట్టలేదు అని చూపిద్దామని అనుకున్నారు అనుకుంటున్నానని మండిపడ్డారు. మరొక భక్తుడు గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు, ఈ సంవత్సరమే ఇలా జరిగింది.. చచ్చిపోతాను అనుకున్నాను కానీ దేవుడి దయవల్ల బతికాను. ఒక్కసారిగా గేట్లు తియ్యడం వల్లే తోపులాట జరిగిందని భక్తుడి ఆవేదన చెందారు. ఉదయం నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కాపలా కాస్తున్నారని మరొక భక్తుడు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

Tirupati Stampede Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement