Talliki Vandanam Scheme: విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్, మే నెలలో తల్లికి వందనం, ఆ వెంటనే అన్నదాత పథకం అమలు చేస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం.

Chandrababu (photo-APCMO)

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం. సాగుకు భరోసా కల్పించేందుకు అన్నదాతకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడువిడతల్లో రూ.20 వేలు అందజేస్తాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Share Now