TDP Activists Attacked DC Office: డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని ఖండించిన జగన్, నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమని వెల్లడి
వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. వీడియో ఇదిగో, డెక్కన్ క్రానికల్ ఆఫీసును తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన డీసీ
టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీలో ప్రజాస్వామ్యం పదేపదే ఉల్లంఘనలకు గురవుతోందని... ఏపీ ముఖ్యమంత్రి దీనికి కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు.
Here's Jagan Tweet