TDP vs Janasena Fight: వీడియో ఇదిగో, మచిలీపట్నంలో రక్తమొచ్చేలా తన్నుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, బ్యానర్‌లో ఫోటోలు వేయకపోవడంపై అభ్యంతరం
మచిలీపట్నంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.
మచిలీపట్నంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్ పై తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు. వీడియో ఇదిగో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి
దీంతో యర్రంశెట్టి నానిపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆయన ఇళ్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో యర్రంశెట్టి నాని గాయపడ్డారు.అనంతరం ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్‌మెంట్ చేశారు. అయితే, సెటిల్‌మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా టీడీపీ నేతలు తీవ్రంగా కొట్టారు. బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని టీడీపీ నేతలు క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. జనసేన, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు చిలకలపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)