వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.

పెద‌కూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు వ‌ర‌ద ముంపు గ్రామాల ప‌రిశీల‌న‌కు వెళ్తున్న స‌మ‌యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ కార‌ణంగా 14వ మైలు వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అని నంబూరు శంక‌ర్రావు ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఇదంతా ప్లాన్‌ ప్రకారం చేసిన దాడి అంటూ వ్యాఖ్యలు చేశారు

వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)