Chandrababu's Hyderabad Visit: వీడియో ఇదిగో, హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు, రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు

Chandrababu's Hyderabad Visit (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కారులో నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు అభిమానులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఖాతాలో మ‌రో రెండు విజ‌యాలు, శాస‌న మండ‌లిలోనూ పెరుగుతున్న బ‌లం

విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు తొలిసారిగా భేటీ కానున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై సమావేశంలో చర్చించే అవకాశముంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. తమకు ఏపీ ప్రభుత్వం రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుండగా, తమకే రూ.7 వేల కోట్లు వస్తాయని ఏపీ చెబుతోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement