Dasari Gopi Krishna: అమెరికాలోని సూపర్ మార్కెట్ లో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ బాపట్ల యువకుడు మృతి
అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Newyork, June 23: అమెరికాలో (America) శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) (Dasari Gopi Krishna) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ.. 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకితో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన గోపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
Ambati Rambabu on Posani Arrest: పోసాని ఏమైనా అంతర్జాతీయ కుట్ర చేశాడా? గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, మండిపడిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
Advertisement
Advertisement
Advertisement