Temple Chariot Set on Fire: అనంతపురంలో రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు
సోమవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో రామాలయ రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.
సోమవారం అర్ధరాత్రి అనంతపురం జిల్లాలోని కనేకల్ మండలం హనకనహల్‌లో గుర్తుతెలియని దుండగులు ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలో రామాలయ రథం దగ్ధం ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేయాలని కలెక్టర్, ఎస్పీని కోరారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు.దీంతో జిల్లా పోలీసులు, అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి బయలు దేరి, గ్రామస్థులతో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)