Tension Erupts in Tadipatri: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు

మూడు నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.టీడీపీ నేతల దాడిలో రఫీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Tension erupts in Tadipatri after Kethireddy Pedda Reddy and TDP MLA JC groups attack each other Watch Video

తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. మూడు నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.టీడీపీ నేతల దాడిలో రఫీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి బయటకు పంపించారు.  వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు ఓవర్ యాక్షన్, సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి విచక్షణా రహితంగా దాడి

దీంతో పాటు వైఎస్సార్‌సీపీ నేత కందిగోపుల మురళీ ఇంటిపై కూడా జేసీ అనుచరులు దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. తాడిపత్రి పట్టణంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. కాగా ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల తర్వాత YCP మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచి వెళ్లారు.ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పెద్దారెడ్డిని అనంతపురం పంపించామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.మురళీ తుపాకీ చూపడం వల్లే తమ కార్యకర్తలు రెచ్చిపోయారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు తెలిసినా నిలువరించే ప్రయత్నం చేయలేదన్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)