Drone Over Srisailam Temple: శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. ఆలయంపై ఆకాశంలో డ్రోన్ చక్కర్లు.. సత్రాలపై కూడా ఎగిరిన డ్రోన్.. డ్రోన్ ఎగరేసిన వ్యక్తుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు
దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో దేవస్థానం సిబ్బంది అవాక్కయ్యారు.
Srisailam, April 15: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం దేవస్థానంలో (Srisailam Temple) మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ (Drone) కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో దేవస్థానం సిబ్బంది అవాక్కయ్యారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా ఆకాశంలో డ్రోన్ కెమెరా ఎగురుతుండటాన్ని గుర్తించిన ఆలయ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. అప్రమత్తమైన దేవస్థానం చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది డ్రోన్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఆర్టీసీ బస్టాండు కమ్మ సత్రం, బలిజ సత్రం ఆలయ పరిసరాలలో ఆకాశంలో ఎగురుతూ స్థానికులకు డ్రోన్ కెమెరా కనిపించింది. సత్రాలపైకి ఎక్కిమరి డ్రోన్ ను ఎగరేసినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. ఎగురవేసిన వారికోసం సెక్యూరిటీ సిబ్బంది వెదుకుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)