Vijayawada Floods: వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది.

family trapped in a house near Rythu Bazar at YSR Junction due to Heavy Rains

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది. పసిపిల్లలు, బాలింతలు, ఆడవాళ్లు, నడవలేనివాళ్లు ఇంట్లో ఇరుక్కుపోయామని, మూడు రోజులుగా తాగడానికి నీరు, ఆహారం లేవని కాపాడాలంటూ ఓ వ్యక్తి వీడియో పోస్టు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మెసేజ్లు, కాల్స్ చేసినా రెస్పాండ్ కావట్లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరదల్లో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులను కాపాడాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement