Vijayawada Rains: వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు

మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.

Manthena Satyanarayana Ashram is completely submerged on the Karakatta in Vijayawada

భారీ వర్షాలతో విజయవాడ విలవిల లాడుతోంది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బెజవాడ వాసులకు కష్టాలు రెట్టింపయ్యాయి. కృష్ణా నదిలోకి భారీగా నీరు చేరుతుండడంతో భవానిపురానికి వరద ముప్పు పొంచివుంది.ప్రకాశం బ్యారేజ్ ఎగువ వాటర్ పున్నమి ఘాట్ వద్ద రోడ్డు పైకి చేరుతోంది. సహాయ సిబ్బంది ఇసుక బస్తాలతో నీటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)