Video: వీడియో ఇదిగో, విశాఖలో మద్యం మత్తులో మహిళా డాక్టర్ బీభత్సం, వీఐపీ రోడ్డులో తాగి డ్రైవ్ చేసి డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి నుజ్జయిన కారు

రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

VisakhaPatnam Woman doctor created havoc while driving under the influence of alcohol

విశాఖపట్టణంలో గత రాత్రి ఓ వైద్యురాలు తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ బీభత్సం సృష్టించింది. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జుగా మారింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

VisakhaPatnam Woman doctor created havoc while driving under the influence of alcohol

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement