Vizag Student Dies in Canada: కెనడాలో గాజువాక విద్యార్థి అనుమానాస్పద మృతి, స్పందించిన నారా లోకేష్, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి

వైజాగ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నాడు

Gajuwaka Student Pilli Phani Kumar dies under suspicious circumstances in Canada (Photo-Telugu Scribe)

వైజాగ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నాడు. అయితే హాస్టల్ లో నిద్రిస్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.నిద్రలో గుండె పోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులుకి ఫణికుమర్ మిత్రులు ఫోన్ చేసి చెప్పారు.

ఫణి కుమార్ తండ్రి నాగ ప్రసాద్ మాట్లాడుతూ, కెనడాలోని తన కుమారుడి రూమ్‌మేట్ (ట్రక్ డ్రైవర్) నుండి డిసెంబర్ 14 ఉదయం తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఫణి కుమార్ గదిలోనే మరణించాడని సమాచారం ఇచ్చాడు. అతని మరణానికి గల కారణాల గురించి ఇతర వివరాలు అందించబడలేదు. కాల్గరీ పోలీసులు మరణించిన వ్యక్తి వస్తువులను (ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ మొదలైనవి) స్వాధీనం చేసుకున్నారు, అయితే అతని మరణానికి సంబంధించి కుటుంబానికి ఇంకా స్పష్టమైన వివరణ అందించబడలేదు.

వీడియో ఇదిగో, ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, పుట్టినరోజు నాడే విషాదకర ఘటన

ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఫణి కుమార్ మృతి చెందడం అత్యంత బాధాకరం. వారి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఫణి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని తెలిపారు.

Vizag Student  Pilli Phani Kumar Dies in Canada:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now