Roja on Balakrishna: వీడియో ఇదిగో, బావ కళ్లలో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేస్తున్నాడు,మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం సెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రోజా మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది

MLA Roja (Photo-Twitter)

ఏపీ అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం సెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రోజా మాట్లాడుతూ.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారు. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్‌ విసిరేసి, బాటిల్స్‌ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉంది. బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడు. బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు.

చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు. తనకు ఓటేసిన హిందూపురం ప్రజల సమస్యల కోసం ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడాడా?, అక్రమంగా ప్రజల డబ్బును దోచేసి చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి మొత్తం బయటికి తీస్తాం. దమ్ముధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.

Heres' Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement