Jagan On Posani Arrest: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్‌ను ఖండించిన వైఎస్ జగన్.. పోసాని భార్యకు ఫోన్‌లో పరామర్శ, అండగా ఉంటామని ధైర్యం చెప్పిన జగన్
సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు . అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు( Jagan On Posani Arrest). అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి(Posani Krishnamurali) వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు
జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.
YS Jagan Condemns The Arrest on Posani Krishnamurali
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)