Kodali Nani: వీడియో ఇదిగో, విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని, అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తలకు చెక్, వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తల నేపథ్యంలో తాజాగా కొడాలి నాని విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని కనిపించారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎప్పుడూ టైగరే అంటూ పోస్టులు పెడుతున్నారు.

Kodali Nani, Perni Nani, Nandigam Suresh at Vijayawada Sub Jail (Photo-Video Grab)

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లారు. ములాఖత్ ద్వారా వంశీని కలిశారు. ఆయనను పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు.

జైలు వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను, కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడే అవకాశం ఉంది.వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు.

వల్లభనేని వంశీతో జగన్‌ ములాఖత్‌, జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యాక కొడాలి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారనే వార్తల నేపథ్యంలో తాజాగా కొడాలి నాని విజయవాడ సబ్ జైల్ వద్ద కొడాలి నాని కనిపించారు. దీంతో కొడాలి నాని అభిమానులు టైగర్ ఎప్పుడూ టైగరే అంటూ పోస్టులు పెడుతున్నారు.

Kodali Nani, Perni Nani, Nandigam Suresh at Vijayawada Sub Jail

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement