Andhra Pradesh: పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, వీడియోను విడుదల చేసిన టీడీపీ

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి

ysrcp mla pinnelli ramakrishna reddy throws EVM machine on ground to damage it & walks out nonchalantly TDP demanded stringent EC action Watch Video

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. గుర్తుపెట్టుకో..జూన్ 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బొత్సా సత్యనారాయణ

ఓ వ్యక్తి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ బయటికి వెళ్లిపోయారు. ఇదంతా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. దీనిపై టీడీపీ స్పందిస్తూ... ప్రజలు తమకు ఓట్లు వేయలేదని, జగన్ చేయని పాపం లేదని వ్యాఖ్యానించింది. పిన్నెల్లీ... నువ్వు ప్రజాప్రతినిధివా, లేక వీధి రౌడీవా? అంటూ టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ని నిలదీశారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now