Vjy, May 21: జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలతో జగన్ కు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. జగన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు నేను చెప్పింది తప్పయితే నా మొఖానే పేడ నీళ్లు పడతాయి రైట్ అయితే జగన్ రెడ్డి మీద పడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు. జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారు, మరోసారి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
వైఎస్సార్‌సీపీ కోసం ఐప్యాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తోందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ అయినా,ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్సార్‌సీపీ శాశ్వతమని తెలిపారు. కో ఆర్డినేషన్ కోసం ఐప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని అన్నారు. ఐప్యాక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవని అన్నారు. ఐప్యాక్ ఓ జాబితా ఇస్తుందని,అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయి... భవితవ్యం బ్యాలట్ బాక్సులలో ఉన్నాయి. మేం గెలుస్తామని.. జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పామన్నారు. వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్
విద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారు. మాపై బురద జల్లుతున్నారు. విద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచన. మా విధానాలు నచ్షే పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాం. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదు.
ప్రదాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. వాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?. చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలి. చంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు లోకేష్ విదేశాలకు వెళ్లారు. రాష్ట్ర ప్రజలని సంయమనం పాటించాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండని తెలిపారు.
రాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమే. ఎందుకు హర్రీ అండ్ వర్రీ. చంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకు వెళ్తే తప్పేంటి?. ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. భయంతో చంద్రబాబు విదేశాలకు పారిపోయారా?. సీఎం జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి? వైఎస్ జగన్ అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి? ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదు.
మాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నా. మేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?. తన పాలన చూసి ఓటేయాలని ప్రదాని మోదీనే అడగలేకపోయారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ మాత్రమే అడిగారు సీఎం రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారు. నా తప్పులని దిద్దుకుంటానని అదికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదా?
దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాం. మా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగింది. గ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణం, వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాం. ప్రజలికు కావాల్సిన విధానాలని, సంస్కరణలనే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌కు మళ్లీ పట్టం కట్టారని మేం భావిస్తున్నాం.’ అని బొ త్స పేర్కొన్నారు.