ఏపీలో త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలతో జగన్ కు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. జగన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు నేను చెప్పింది తప్పయితే నా మొఖానే పేడ నీళ్లు పడతాయి రైట్ అయితే జగన్ రెడ్డి మీద పడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్
ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహకర్తగా నాకు పదేళ్ల అనుభవం ఉంది... ఆ అనుభవంతో చెబుతున్నా... ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోంది అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు.
Here's Video
జగన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు నేను చెప్పింది తప్పయితే నా మొఖానే పేడ నీళ్లు పడతాయి రైట్ అయితే జగన్ రెడ్డి మీద పడతాయి...iPAC ప్రశాంత్ కిషోర్ pic.twitter.com/2ZcyZBgtPt
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)