MLA RK Roja: మేమంతా జగన్ సైనికులం, ఆయన నమ్మకాన్ని నిలబెడతామని తెలిపిన మంత్రి రోజా, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే

పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్ర‌మంలో ఆమె భ‌ర్త‌ సెల్వమణి, కుమారుడు, కూతురు, ఇంకా వైసీపీ నేత‌లు కూడా పాల్గొన్నారు.

MLA Roja (Photo-Twitter)

పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్ర‌మంలో ఆమె భ‌ర్త‌ సెల్వమణి, కుమారుడు, కూతురు, ఇంకా వైసీపీ నేత‌లు కూడా పాల్గొన్నారు. రోజా బాధ్యతలు స్వీకరించేముందు ఆమెకు భ‌ర్త సెల్వ‌మ‌ణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. రోజా మంత్రి చాంబర్‌లోని చైర్‌లో కూర్చున్న అనంత‌రం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు.బాధ్యతలు స్వీకరించిన రోజా గండికోట టూ బెంగళూరు బస్సు సర్వీసును ప్రారంభిస్తు తొలి సంతకం చేశారు.

ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ… త‌న‌పై సీఎం వైఎస్‌ జగన్ కు ఉన్న‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని తెలిపారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వైసీపీని స్థాపించ‌కముందు నుంచే తాను జగన్ అడుగు జాడల్లో నడిచానని..ఏపీ మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ కు సైనికుల్లా పనిచేశారని అన్నారు. జగన్ లాంటి గొప్ప‌ నేతతో కలిసి నడవడం త‌మ‌ అదృష్టంగా భావిస్తున్నామ‌ని అన్నారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ను రోజా కలిశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement