Vijayasai Reddy on Chandrababu: బాబు వస్తే కరువు వస్తుంది, చంద్రబాబు, కరువు కవల పిల్లలు, ఏపీ ఐదు జిల్లాల్లో 54 కరువు మండలాల జీవో ప్రకటనపై విజయసాయిరెడ్డి సెటైర్
వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఏపీలో వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబరు15 జారీచేసింది. ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
బాబు వస్తే కరువు వస్తుంది.చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
YSRCP MP Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)