YSRCP and YS Vijayamma (photo-YSRCP)

Vjy, Oct 20: అన్నా చెల్లెలు మధ్య కుటుంబ ఆస్తుల విషయం నేపథ్యంలో దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై వైసీపీ స్పందించింది. వైఎస్‌ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్‌ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్‌ విజయమ్మ తన లేఖలో (YS Vijayamma Open Letter)ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రశ్నించింది.

వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన

షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్‌ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి (YSR) పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది.

పూర్తి లేఖ ఇదిగో..

షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్‌ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్‌ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది.

అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు లేఖను విడుదల చేస్తున్నామని తెలిపింది.