Vijayasai Reddy Slams Nara Lokesh: అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ విను, నారా లోకేష్‌కి కౌంటర్ విసిరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి.
మీడియాలో, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై విజయసాయి రెడ్డి మండిపడుతున్నారు. తాజాగా నారా లోకేష్ మీద విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. "నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులు ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్లీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత 20 నెలల మీ వీడియోలను మీరే చూసుకోడండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?" అంటూ ధ్వజమెత్తారు. . నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి చేత క్షమాపణలు చెప్పిస్తా, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Here's Tweets