'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, ఏసీపీ ముందు విచారణకు హాజరైన అల్లు అర్జున్, పీఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 11 గంటలకు పీఎస్‌లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అల్లు అర్జున్‌తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్‌కు వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పీఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు.. వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీదా కూడా విచారించే వీలుంది. దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా.. ఏసీపీ రమేష్ కుమార్‌తో పాటు సెంట్రల్ జోన్ డిసీపీలు అల్లు అర్జున్‌ను విచారించనున్నారు.
Actor Allu Arjun reaches Chikkadpally police station
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)