Hyderabad: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం,జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు
ఇటీవల హైదరాబాదులో ఐదేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటించింది.
ఇటీవల హైదరాబాదులో ఐదేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటించింది. హైదరాబాదులో ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశం జరిగింది. బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)