TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు

ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Telangana RTC Strike | (Photo-PTI)

Hyderabad, Feb 10: పండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై  ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో కార్తీక మాసం, వన భోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీ కల్పించింది. గత ఏడాది డిసెంబర్‌ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. కాగా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్శించేందుకు టీఎస్‌ ఆర్టీసీ రాయితీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)