Road Accident in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. మరికొందరికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
Adilabad, July 8: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను (Auto) గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను, మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)