Huzurabad, July 8: మానవీయత, ఆత్మీయత, భావోద్వేగాల ముందు రాజకీయ కక్షలు, కోపాలు ఏమాత్రం పనిచేయవని మరోసారి రుజువైంది. అకాల మరణం చెందిన సన్నిహితుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కలిసి పాడెమోశారు. హుజూరాబాద్‌లో (Huzurabad) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఏబీవీపీ పూర్వ కార్యకర్త, హుజురాబాద్ పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు నందగిరి మహేందర్ రెడ్డి (లడ్డు) గారు నిన్న గుండెపోటుతో మరణించడం బాధాకరం. నేడు వారి భౌతికకాయానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు… pic.twitter.com/JpwEOqwXwS
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 7, 2023
అసలేం జరిగిందంటే??
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్‌రెడ్డి అంత్యక్రియలు నిన్న నిర్వహించారు. బీఆర్ఎస్‌లో చేరకముందు ఆయన రెండు దశాబ్దాలపాటు ఏబీవీపీ, బీజేపీలో పనిచేశారు. బండి సంజయ్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2021 హుజారాబాబ్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కౌశిక్‌రెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది. నిన్న ఆయన అంత్యక్రియలకు సంజయ్, కౌశిక్ వేర్వేరుగా హాజరైనప్పటికీ ఇద్దరూ కలిసి పాడెమోశారు.