Akbaruddin Owaisi on Bribe: హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళుతున్నాయి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.

AIMIM MLA Akbaruddin Owaisi (Photo-Video Grab0

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనులకు లంచాలు వెళ్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే, నేనెందుకు ఇవ్వాలి మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పానని తెలిపారు.  భారీ వర్షాలతో నిండుకుండల్లా తెలంగాణ ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుల్లో ఎంత వాటర్ ఫ్లో ఉందో తెలుసా?

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారు.. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు అయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారు.. హత్యలు పగటిపూట జరుగుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు.

Here's Akbaruddin Owaisi Speech Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement