Hyd, July 28: దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డతో పాటు వివిధ ప్రాజెక్టులు వర్షాలు, వరదనీటితో నిండు కుండలను తలపిస్తున్నాయి.
క్రమక్రమంగా ప్రాజెక్టుల్లో నీళ్లు పెరుగుతుండటంతో పలు ప్రాజెక్టుల్లో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్నటివరకు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది. నీటిమట్టం 52.80 అడుగులకు దగ్గడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నదిలో 14,15,384 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
నిజాంసాగర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 940 క్యూసెక్కులుగా ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1,389 అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.అడుగులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 18 వేల క్యూ సెక్కులుగా ఉండగా నంది పంప్ హౌజ్‌కు 12,600 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కుల ఎత్తి పోత కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉండగా కుడి, ఎడమ కాల్వలకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
కొమురం భీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 2 వేల క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉండగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒక్కసారిగా పెరిగిన గోదావరి ఉధృతి, భద్రాచలం వద్ద పరివాహక గ్రామాల్లో అప్రమత్తం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక