CM Revanth Reddy Unveils Rajiv Gandhi Statue: వీడియో ఇదిగో, తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున నేతలు పాల్గొననున్నారు. వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది.
గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తొంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)